మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు విన్నవించారు. ఈ మేరకు ఆదివారం మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్‌తో వెళ్లి నగరంలో మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో జేఏసీ చైర్మన్ వత్తుల రఘుఫతి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు మనోహర్, మల్లేష్ యాదవ్, దత్తు నాయక్ ఉన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబుకు జేఏసీ నేతల వినతి