షాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీకి యువతే కీలకమని యువతీయువకులంతా ఏకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రతాప్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాములుగౌడ్, సుదర్శన్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పీసరి సతీష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య, మాజీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, జిల్లా యువ మోర్చా అధికార ప్రతినిధి కూతురు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి