అబ్దుల్లాపూర్‌మెట్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... మండల పరిధిలోని అనాజ్‌పూర్ గ్రామంలోని శివాలయం వద్ద బస్టాండ్‌లో శుక్రవారం గుర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి సూరిబాబు అక్కడికి చేరుకుని 108 వాహనానికి ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది మహిళను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా మృతిచెందిన మహిళ స్థానికంగా బిక్షాటన చేసుకుంటూ ఉండేదని స్థానికులు తెలిపారు.