షాద్‌నగర్‌రూరల్: మనస్తాపానికి గురైన వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ శివారులో బుధవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన సంద శ్రీనివాస్(32) డ్రైవర్‌గా పని చేస్తూ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కొంత కాలం క్రితం అతడి తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరూ లేకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకొని బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ అబుదేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.