శంకర్‌పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న మృతిచెందాడు. శంకర్‌పల్లి పట్టణ శివారులో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిల్లిగుండ్లకు చెందిన గోవర్ధన్‌రెడ్డి, సుధ దంపతులకు హర్షవర్ధన్‌రెడ్డి(30), ధ్రువతేజరెడ్డి సంతానం. శంకర్‌పల్లి శివారులో నిర్మిస్తున్న సుభిషి కన్‌స్ట్రక్షన్స్‌లో హర్షవర్ధన్‌రెడ్డి సైట్ ఇంజనీర్‌గా, ధ్రువతేజరెడ్డి సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విధులు ముగించుకున్న హర్ష తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి దాటిన తర్వాత.. వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అదుపు తప్పిన బైక్ వేగంగా వెళ్లి డివైడర్‌ను తాకింది. దీంతో హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి ఉద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలు
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన