
మొయినాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఫాం హౌస్‌పై పోలీసులు దాడి చేసి 15మంది యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. ఈ ఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనకమామిడి శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి కనకమామిడి శివారులోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో పోలీసులు దాడి చేయగా నాలుగు గదుల్లో నలుగురు యువతీయువకులు వ్యభిచారం చేస్తూ దొరికారు. మరో 11 మంది బయట మధ్య సేవిస్తూ దొరికారు. వీరంతా కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రలకు చెందిన వారిగా గుర్తించారు. ఫాంహౌస్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుని ఇక్కడికి వచ్చారు. వారి వద్ద నుంచి 15 మద్యం బాటిళ్లు, రెండు కండోమ్ ప్యాకెట్లు, ఐదు కార్లు, 18 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.