● గంజాయి తరలిస్తూ పట్టుబడిన ముగ్గురు యువకులు
తిమ్మాపూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గంజాయి కొనుగోలు చేసి తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో యువకులకు అమ్ముతున్న అల్గునూర్‌కు చెందిన అందె అజయ్, సిల్ల పరశురామ్, ముసాపురి అరవింద్‌ను ఎల్‌ఎండీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై అన్వర్ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం ముగ్గురు యువకులు గంజాయితో బైక్‌పై అల్గునూర్‌వైపు వెళ్తున్నారని ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అల్గూనూర్ చౌరస్తాలో గంజాయితో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నించారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఛేజ్ పట్టుకున్న పోలీసులు.. వారిని తనిఖీ చేయగా, పాలిథిన్ కవర్‌లో 235 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అదుపులోకి తీసున్నారు. యువకుల నుంచి బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు.


