కరీంనగర్‌టౌన్: కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం నగర శివారులోని అల్గునూరులో దగ్ధమైన విషయం తెలిసిందే. కాగా అగ్నిప్రమాద సమయంలో బస్సులోని 39 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడిన డ్రై వర్ బోయిని ప్రశాంత్‌ను సోమవారం జేబీఎం, చక్రా ఈ –ట్రాన్స్ యాజమాన్యాలు సన్మానించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యతాయుతమైన చర్యల ద్వారా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడటమే కాకుండా, టీజీఎస్‌ఆర్టీసీ ప్రతిష్టను నిలబెట్టినందుకు గుర్తింపుగా ప్రాంతీయ రీజినల్ మేనేజర్ రాజు చేతుల మీదుగా ప్రత్యేక షీల్డ్, ప్రశంసాపత్రం, రూ.5వేల నగదు బహుమతిని అందజేశారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరె డ్డి, డిప్యూటీ ఆర్‌ఎం మల్లేశం, 2 డిపో మేనేజర్ శ్రీనివా స్, జేబీఎం ఆపరేషన్స్ మేనేజర్ అభిచరణ్, చక్రా ఈ –ట్రాన్స్ ఆపరేషన్స్ మేనేజర్ ఖాన్, అన్వర్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.


