బెల్టుషాపుల బంద్‌కు జీపీ తీర్మానం | - | Sakshi
Sakshi News home page

బెల్టుషాపుల బంద్‌కు జీపీ తీర్మానం

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

జమ్మికుంట: మద్యం అమ్మకాల కట్టడికి మండలంలోని మడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచన చేసింది. సోమవారం సర్పంచ్‌ పసుల తిరుమల అధ్యక్షతన పాలకవర్గం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్ట్‌షాపుల నిర్వహణ బంద్‌ చేయాలని తీర్మానం చేశారు. జీపీ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుందని, మద్యం విక్రయాలకు సంబంధించి సమాచారం అందించిన వారికి రూ.2వేల బహుమతి అందజేస్తామని పాలకవర్గం తీర్మానం చేసింది. కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్‌ కస్తూరి శ్రీనాథ్‌, వార్డు సభ్యులు సురేశ్‌, సాయిరాం, హసీనా, శ్రీనివాస్‌, కళ్యాణి, శేషివాదన, ఆంజనేయులు, చెన్నబోయిన చంద్రమౌళి, రాణి తదితరులు పాల్గొన్నారు. కాగా బెల్ట్‌షాపుల బంద్‌పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement