ఇప్పటి వరకు సొసైటీల ద్వారా ఎరువులు, రుణాలు, ధాన్యం కొనుగోళ్లు మాత్రమే చేపట్టాం. ఇక నుంచి విత్తనోత్పత్తి చేసి ఆ విత్తనాలను రైతులకు సొసైటీ బ్రాండ్‌తో ఇవ్వనున్నాం. ఇలా ఇవ్వడం ద్వారా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి పొందవచ్చు.
– జిల్లా రైతు విజ్ఞాన కోఆర్డినేటర్ డా.ఆర్.సాయికుమార్
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుంది. సొసైటీ ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టి సొసైటీ బ్రాండ్‌పై రైతులకు అందిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద వేములవాడ సొసైటీని ఎంపిక చేశారు. మా సొసైటీకి విత్తనోత్పత్తి చేసేందుకు సొంత స్థలాలు కూడా ఉన్నాయి.
– ఏనుగు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వేములవాడ


