చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న
ఎంఈవో తదితరులు
పాఠశాలను ప్రారంభిస్తున్న ఎంఈవో కనకతార, సర్పంచ్, ఉపాధ్యాయులు
మెట్‌పల్లిరూరల్: దశాబ్దాల తరబడి పిల్లలకు అక్షరాలు నేర్పి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల మూతబడడంతో ఆ గ్రామ సర్పంచ్ దంపతులు చలించిపోయారు. మూతబడిన ఆ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలని కంకణం కట్టుకున్నారు. ముందుగా తమ ఇద్దరు పిల్లలను పాఠఽశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. ఇందుకు అంగీకరించిన తల్లిదండ్రులు పాఠశాలను తెరిపించాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో చర్యలు చేపట్టిన అధికారులు మూతబడిన పాఠశాలను తెరిపించారు. మెట్‌పల్లి మండలం కేసీఆర్‌తండాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పదేళ్ల కిందట మూతబడింది. అప్పటి నుంచి ఆ పాఠశాలను తిరిగి తెరిపించాలని ఎవరూ దృష్టి సారించలేదు. ఇటీవల సర్పంచ్‌గా ఎన్నికై న మంజుల, గణేశ్ దంపతులు పాఠశాలకు పూర్వవైభవం తేవాలని వారి పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నామని ఊరంతా తెలిపారు. దీంతో మిగతా వారు కూడా తమ పిల్లలను చేర్పిస్తామని చెప్పడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను పునఃప్రారంభించారు. మెట్‌పల్లి ఎంఈవో కనకతార సోమవారం పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో సాముహిక అక్షరాభ్యాసం చేయించారు. పుస్తకాలు, నోట్‌బుక్కులు ఇతర సామగ్రి అందించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 25 ఉండగా.. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ మదన్‌లాల్, విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొన్నారు.
పదేళ్ల తర్వాత తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాల
సర్పంచ్ తన పిల్లలను చేర్పించడంతో పూర్వవైభవం
25మందికి చేరిన విద్యార్థుల సంఖ్య


