ఒద్యారం స్కూల్‌కు జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఒద్యారం స్కూల్‌కు జాతీయ పురస్కారం

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

కరీంనగర్‌టౌన్‌: జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. కరీంనగర్‌ జిల్లా నుంచి ఒద్యారం ప్రభుత్వ హైస్కూల్‌, పెద్దపల్లి జిల్లా నుంచి ఎల్కపల్లి పాఠశాల, జగిత్యాల జిల్లా నుంచి బీర్‌పూర్‌ పాఠశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నెహ్రూనగర్‌ హైస్కూల్‌ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ వి.నవీన్‌ నికోలస్‌ సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌(ఎస్‌హెచ్‌వీఆర్‌)ను రెండేళ్లుగా ప్రకటిస్తుంది. పాఠశాల ఆవరణ, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన నీరు, పచ్చదనం తదితర అంశాలను పరిశీలించి గ్రేడ్‌ నిర్ణయిస్తారు. కరీంనగర్‌ జిల్లాలోని ఒద్యారం పాఠశాలలో 300 రకాల చెట్లను విద్యార్థులు సంరక్షిస్తూ, ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తూ, సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ పాఠశాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఇందుకు గానూ రాష్ట్ర స్థాయిలో ఎంపికై న 10 పాఠశాలల్లో ఉమ్మడి జిల్లాలో నాలుగు స్కూళ్లు ఎంపికవగా, కరీంనగర్‌లో ఒద్యారం జడ్పీహెచ్‌ఎస్‌ను ఎంపిక చేశారు. మెరిట్‌ సర్టిఫికెట్‌తో పాటు రూ.1లక్ష ప్రోత్సాహక నిధి, పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక విద్యా అధ్యాయన పర్యటనకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement