● అడవిపదిర గ్రామస్తుల ఆందోళన
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని అడవిపదిరలో నిలిచిన వంతెన పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అడవిపదిరకు రూ.2.36కోట్లు మంజూరు చేయగా.. పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. రెండేళ్లుగా పనులు ముందుకుసాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోతే లాల్‌సింగ్‌తండా మీదుగా మూడు కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఉందన్నారు. ఎస్సై లక్ష్మణ్ గ్రామస్తులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. నాయకులు జాలపెల్లి మనోజ్ కుమార్, భాస్కర్, తిరుపతి, శంకర్, రవి, బాలకిషన్, రాజు, కార్తీక్, వినోద్, జాషువా, అజిత్ పాల్గొన్నారు.


