● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల అర్బన్: జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ అర్జీలు అందించి ఆదుకోండని వేడుకున్నారు. వివిధ సమస్యలపై 159 అర్జీలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.


