● బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గుజ్జల ప్రేమ్‌చందర్‌రెడ్డి
సిరిసిల్లటౌన్: పుష్కరాకాలంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదర్శ పాలనను చూసి ప్రపంచం గర్వించిందని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గు జ్జల ప్రేమ్‌చందర్‌రెడ్డి కొనియాడారు. మోదీ సుపరి పాలనకు 12 సంవత్సరాలు పూర్తి సందర్భంగా సి రిసిల్లలోని కే కన్వెన్షన్ హాలులో సోమవారం రాత్రి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన నిర్వహించిన మేధావుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, ప్రధానిగా 12 ఏళ్లు మొత్తంగా పాతికేళ్లపాటు ప్రజానేతగా వెలు గొందడం అసాధారణ విషయమన్నారు. దేశం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, బేటీ బచావో–బేటీ పడావో వంటి పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందారన్నారు. కేంద్రం పథకాల లబ్ధిదారులను సన్మానించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతి, సిరికొండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గరిపెల్లి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారపు సంతోష్‌రెడ్డి, బర్కం లక్ష్మీనవీన్ యాదవ్, రాజాసింగ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, అయ్యప్ప ఆలయ చైర్మన్ రాచర్ల విద్యాసాగర్, టెక్స్‌టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్‌దాసు అనిల్, ప్రైవేట్ విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సెన్సార్ బోర్డు సభ్యురాలు వేముల వైశాలి పాల్గొన్నారు.


