యోగాసనం వేస్తున్న ఎస్పీ మహేశ్ బి గితే
పోలీస్ అధికారులు, సిబ్బంది యోగాసనాలు
సిరిసిల్ల: అంతర్గత శక్తిని మేల్కొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అమూల్య సాధనం యోగా అని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించాలన్నారు. యోగాకు సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు కె.నాగేంద్రచా రి, జి.వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరా వు, మొగిలి, నటేశ్, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేశ్, రమేశ్, ఎస్సైలు కిరణ్‌కుమార్, ఉపేందర్‌చారి, రంజిత్, ఆర్‌ఎస్సైలు రాజు, శ్రావణ్‌యాదవ్, శ్రీనివాస్, సాయికిరణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌రహిత జిల్లాగా మార్చుదాం
జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చుదామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఎస్పీ మహేశ్ బి గితే కోరారు. తెలంగాణ ఈగల్ టీమ్ రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు, ప్రజలకు వారం రోజుల పాటు అవగాహన కల్పించాలన్నారు.
పోలీస్ అధికారులకు అభినందనలు
జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో కే సుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ మహేశ్ బి గితే ఆదివారం అ భినందించారు. సైబర్ క్రైం కేసుల్లో బాధితులకు రూ.22.31 లక్షలకుపైగా రీఫండ్ అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, కోర్టు విచారణలో ఉన్న 265 కేసులు, 23 పెట్టి, 1,043 డ్రంకెన్ డ్రైవ్, 2,419 ట్రాఫిక్ చలాన్, 75 సైబర్ క్రైం కేసులను లో క్‌అదాలత్ ద్వారా పరిష్కరించడం విశేషమన్నారు.


