● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ
సిరిసిల్లటౌన్: యోగాతో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని జిల్లా జడ్జి పి.నీరజ అన్నారు. ఆదివారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో మాట్లాడారు. రోజూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవడుతుందన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదనపు జిల్లా జడ్జి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జికుమారి మేఘన, సిరిసిల్ల బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.


