● ప్రశాంతంగా ఏడు చేనేత, నాలుగు పవర్‌లూమ్ సహకార సంఘాల ఎన్నికలు ● చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు ఎస్.సంతోష్‌కుమార్
సిరిసిల్ల: జిల్లాలోని ఏడు చేనేత, నాలుగు పవర్‌లూమ్ సహకార సంఘాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పరిమిత ఓట్లు ఉండడంతో అధ్యక్ష, పదవితోపాటు కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చివరి సారిగా 2013 ఫిబ్రవరిలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రతీ ఆరు నెలలకోసారి పదవీ కాలాన్ని పొడగిస్తూ వచ్చారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. ఒక్కో సంఘంలో తొమ్మిది మందితో కూడిన కార్యవర్గం ఎన్నికల కాగా.. అందులో ఒక్కరు అధ్యక్షుడు, ఒక్కరు ఉపాధ్యక్షుడు, మరొకరు కార్యదర్శి, ఇంకొకరు కోశాధికారి, మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
అన్ని సంఘాలూ ఏకగ్రీవం :
జిల్లాలో 11 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు ముగిశాయి. చేనేత సహకార సంఘాల్లో 234 మంది, పవర్‌లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు.
– సంతోష్‌కుమార్, చేనేత, జౌళిశాఖ
సహాయ సంచాలకుడు


