● రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం ● కనిష్టస్థాయిలో ఎగువ, లోయర్‌, మిడ్‌మానేరు డ్యాంలు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ తగ్గుతున్న నీరు ● ఈసారి ఉమ్మడి జిల్లాలో సాగునీటికి చిక్కులే | - | Sakshi
Sakshi News home page

● రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం ● కనిష్టస్థాయిలో ఎగువ, లోయర్‌, మిడ్‌మానేరు డ్యాంలు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ తగ్గుతున్న నీరు ● ఈసారి ఉమ్మడి జిల్లాలో సాగునీటికి చిక్కులే

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

● రోజురోజుకు పడిపోతున్న నీటిమట్టం ● కనిష్టస్థాయిలో ఎగువ, లోయర్‌, మిడ్‌మానేరు డ్యాంలు ● ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ తగ్గుతున్న నీరు ● ఈసారి ఉమ్మడి జిల్లాలో సాగునీటికి చిక్కులే పడిపోతున్న నీటిమట్టం..

ఉమ్మడి జిల్లా వ్యవసాయానికి గోదావరి, మానేరు నదులు ప్రాణాధారం. రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులే ఇటు ఉమ్మడి జిల్లాకు, అటు ఇతర జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తున్నాయి. అలాంటి ఈ రెండు నదులు ఈ వేసవిలో దాదాపుగా ఎండిపోతున్నాయి. ఈ పరిణామం రైతులను, వ్యవసాయాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. అప్పర్‌ మానేరు 1 టీఎంసీ పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 19 అడుగులకు చేరుకుంది. ఇక 27 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్‌మానేరు డ్యామ్‌ (ఎంఎండీ)లో ప్రస్తుతం 7.4 టీంఎసీలకే పరిమితమైంది. లోయర్‌మానేర్‌ డ్యాం (ఎల్‌ఎండీ) 24 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 6 టీఎంసీలే నమోదు చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దరిమిలా జలాశయాల్లో నీటి ఆవిరి ఇంకా కొనసాగుతుందని నీటిపారుదల అధికారులు వాపోతున్నారు. ఇక జగిత్యాల జిల్లా పంటలకు కీలకమైన ఎస్సారెస్పీ వరద కాలువలో సాధారణంగా ఆరు మీటర్ల వరకు ఉంటే నీరు ప్రస్తుతం రెండు మీటర్లకు పరిమితమైంది. దీని ఆధారంగా జిల్లాలో 30వేల ఎకరాల పంటలు సాగవుతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement