● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: చేనేత కార్మికులకు అండగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో జరిగిన చేనేత పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తాటికొండ రాజయ్య, కార్యదర్శి పారవెల్లి రాజేశం, కోశాధికారి రాపెల్లి దేవదాసు, కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్‌లో శుక్రవారం చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, పట్టణ అధ్యక్షుడు తూం మధు, కౌన్సిలర్లు కొక్కుల బాలకృష్ణ, ఇప్పపూల అజయ్, చేనేత కార్యవర్గ సభ్యులు దూస రాజేశం, పులి సత్యనారాయణ, తాటికొండ రామస్వామి పాల్గొన్నారు.


