వాస్తు రూపకంగా అన్ని విధాలా బాగుంది | - | Sakshi
Sakshi News home page

వాస్తు రూపకంగా అన్ని విధాలా బాగుంది

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌ శివారులోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని ఎంతో ప్రతిష్టతతో నిర్మించారని, ఆలయ నిర్మాణం వాస్తురూపకంగా అన్ని విధాలా బాగుందని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి అన్నారు. రూ.2కోట్లతో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్ట వేడుకలు వైభవంగా నిర్వహించుకున్న ఆలయాన్ని గురువారం సందర్శించారు. ఇక్కడ కొలువుదీరిన తిరుమలేశులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అనంతరం వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఇల్లందుల గీతాంజలి, ఉప సర్పంచ్‌ కొండాపురం వెంకట్‌ రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, శివ, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement