జిల్లాలో అక్రమ మైనింగ్
ఈటీఎస్ సర్వేలో వెలుగులోకి అక్రమాలు
బుట్టదాఖలైన రూ.129 కోట్ల జరిమానాలు
ఓటీఎస్ ఇచ్చినా.. జరిమానాలు చెల్లించని వైనం
అభివృద్ధి పనులకు కంకర సరఫరా చేశామని అక్రమార్కుల లెక్కలు
జిల్లాలోని వేములవాడ మండలం చంద్రగిరి గుట్టల్లో ఓ స్టోన్ క్రషర్‌కు ఐదు ఎకరాల్లో బండ తవ్వకాలు జరిపేందుకు, బండను కొట్టి కంకర తయారు చేసేందుకు అనుమతి పొందారు. కానీ అనుమతికి మించి పది ఎకరాల్లో గుట్టను పగులగొట్టి బండలు తీసి స్టోన్ క్రషర్‌కు వాడుకున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమ దందా సాగించారు. క్రషర్‌లో ఉత్పత్తి చేసిన కంకరకు సీనరేజీ ఫీజు కూడా చెల్లించకుండా లక్షల క్యూబిక్ మీటర్ల కంకరను కాంట్రాక్టు పనులకు అప్పగించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ హద్దులు దాటి గుట్టలను గుల్ల చేశారు.
కలర్ గ్రానైట్ లీజులు 24
రాయి (కంకర) లీజులు 16
పట్టా భూములు 40.14 హెక్టార్లు
ప్రభుత్వం భూములు 103.43 హెక్టార్లు
ఖనిజం ద్వారా 2023–24 ఆదాయం రూ.16.72 కోట్లు
2024–25లో ఆదాయం లక్ష్యం
రూ.18.77 కోట్లు
2025–26లో ఆదాయం లక్ష్యం
రూ.20.50 కోట్లు


