మహిళల భద్రతపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతపై అవగాహన

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

భీమన్న ఆలయ హుండీ లెక్కింపు వేములవాడ: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రూ.1,70,65,200 నగదు రూపంలో ఆదాయం రాగా, బంగారం 80 గ్రాములు, వెండి 7కిలోల 400 గ్రాములు వచ్చిందన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ ఏసీ ఆఫీస్‌ పరిశీలకులు రాజమౌళి, డీఈవో భాస్కరశర్మ, పర్యవేక్షకులు, అధికారులు, సిబ్బంది శ్రీరాజరాజేశ్వర సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు. డీఆర్సీసీ అక్రమాలపై చర్యలేవి?

గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని ముచ్చర్ల, లింగన్నపేట గ్రామాల్లో గురువారం ఉపాధి హామీ పనులకు హాజరైన మహిళలకు జిల్లా షీటీం అధికారులు అవగాహన కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ, పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు, మహిళా చట్టాలు, హక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో షీటీం ఎస్సైలు ప్రమీల, రవి, సిబ్బంది శ్రీనివాస్‌, ప్రియాంక, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి గురువారం తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఆఫీసు ఎదుట చేపట్టిన రిలేదీక్షల్లో మాట్లాడారు. కార్మికులకు కనీ స వేతనాలు రూ.26వేలు చెల్లించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని కోరారు. అరవై ఏళ్లు దాటిన, అనారో గ్యం పాలైన కార్మికులు, మృతిచెందిన కార్మికు ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరాలని తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూ నియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: డీఆర్‌సీసీలో జరిగిన అక్రమాలపై మున్సిపల్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. గురువారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్‌లోని శానిటేషన్‌ విభాగంలోని తడి పొడి చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ నిర్వహించే టెండర్లలో రూ.18.50 లక్షల టెండర్‌ నిర్వహించగా కేవలం రూ.8లక్షలకే టెండర్‌ ఎలా దక్కించుకుంటారని ప్రశ్నించారు. ఐటీసీ సంస్థ నిర్వాహకుడే బినామీ కంపెనీతో టెండర్‌ దక్కించుకొని మున్సిపల్‌కు రూ.10లక్షలకు పైగా నష్టం చేశారని తెలిపారు. సదరు కాంట్రాక్టర్‌ టెండర్లను రద్దుచేసి ఓపెన్‌ టెండర్‌ నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జే దాసు, తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు సెలంద్రి ఎల్లయ్య, తెలంగాణ వంట కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, లక్ష్మణ్‌, రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement