● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి కాపాడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువా రం సనుగుల శ్రీగోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారని అన్నారు. గిరిజనులు గతంలో సా గు చేసిన భూములకు పట్టాలిస్తామని, కొత్తగా అడవులను మాత్రం నరికి వేయవద్దని కోరారు. అటవీ ప్రాంతం 33 శాతం ఉండాల్సి ఉండగా, జిల్లావ్యాప్తంగా 19 శాతం మాత్రమే ఉందని తెలిపారు. వే ములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం చందుర్తి శివారులోని 176 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఏకో పార్క్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇదే విషయమై అటవీ శాఖ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. వానాకాలంలో రైతులు ప్రభుత్వం ప్రకటించిన సన్నాలను సాగు చేసి బోనస్ పొందాలని కోరారు. డీఎఫ్‌వో సత్యనారాయణ మాట్లాడుతూ అటవీ శా ఖ అధికారులు ప్రజలకు శత్రువులుగా కనిపిస్తున్నారని, పర్యావరణ పరిరక్షణ చెట్లతో సాధ్యమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి ఆఫ్జల్ బేగం, అదనపు ట్రైనీ కలెక్టర్ నిఖిత, ఆర్డీవో కుమారి, ఎఫ్‌ఆర్వోలు నాగేశ్వర్‌రావు, ఖలీలొద్దీన్, గ్రామ సర్పంచ్ లావణ్య అనిల్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ కుమార్, అటవీ శాఖ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, స్వశక్తి సంఘాల మహిళలు, వివిధ శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
సిరిసిల్లటౌన్: అధైర్యపడొద్దు.. మీకు ఆరోగ్యం కుదుట పడేవరకు అండగా ఉంటాం.. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు, పెద్దలను గురువారం రాత్రి కలిసి మాట్లాడారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఆర్డీవో శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డాక్టర్లు తదితరులున్నారు.


