అభయ యాప్‌తో ప్రయాణికుల భద్రత | - | Sakshi
Sakshi News home page

అభయ యాప్‌తో ప్రయాణికుల భద్రత

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

● ఎస్పీ మహేశ్‌ బి గితే

● ఎస్పీ మహేశ్‌ బి గితే

సిరిసిల్ల: ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభయ యాప్‌(మై ఆటో ఈస్‌ సేఫ్‌) ఫేజ్‌–3లో 100 ఆటోలకు అభయ క్యూఆర్‌ కోడ్‌ అనుసంధానం చేశామని ఎస్పీ మహేశ్‌ బి గితే తెలిపారు. గురువారం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అభయ యాప్‌తో వాహనాల డ్రైవర్లకు రూ.50తో రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలు పంపిణీ చేశారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రాధ్యాన్యత ఇస్తున్నామని వివరించారు. అభయ యాప్‌ ద్వారా ఆటోలకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఆటో వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్‌ఐ సురేశ్‌, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, అభిచరణ్‌, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ మహేశ్‌ బి గితే అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట లో ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కమెరాల ప్రామఖ్యత, డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతూ, యువతను మత్తు పదార్థాల దుష్ప్రభా వాల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్‌, ఎస్సై రాహుల్‌రెడ్డి, సర్పంచ్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement