దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యం

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

● ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

● ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

సిరిసిల్లటౌన్‌: దేశాభివృద్ధి లక్ష్యంగా 12ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ మచ్చ లేని పాలన చేశారని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. గురువారం సిరిసిల్లలోని వాసవి కల్యాణ మండటంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో భారతదేశం ఆర్థికంగా వరల్డ్‌లో 18వ స్థానంలో ఉండగా మోదీ విజన్‌తో 3వ స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. 2047 కల్లా వికసిత్‌ ప్రపంచంలోనే మన దేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానంలోకి తీసుకు రావాలని మోదీ సంకల్పించారని, ఇందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. విదేశీ సంబంధాల్లో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గౌరవం తెచ్చారని, ఒకప్పుడు అమెరికా చెప్పిన షరతులకు లోబడే పరిస్థితి ఇప్పుడు ఇండియా కండిషన్స్‌ పెట్టె పరిస్థితికి వచ్చామన్నారు. నూతన ఎడ్యుకేషన్‌ పాలసీతో విద్యా వ్యవస్థలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కూడా డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని కోరారు.

పాఠశాలల సందర్శన

సిరిసిల్లలోని అంబేడ్కర్‌నగర్‌, గోపాల్‌నగర్‌, కుసుమ రామయ్య పాఠశాలలను గురువారం ఎమ్మెల్యే మల్క కొమురయ్య సందర్శించారు. పిల్లలకు అక్షరాభ్యాసం, పుస్తకాలు పంపిణీ చేయించారు. కుసుమ రామయ్య పాఠశాలలో పిల్లలతో భోజనం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహకరిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ వెంట కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి వికాస్‌రావు, జిల్లా ఇన్‌చార్జి మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement