అశ్విన్‌రావుకు నివాళి | - | Sakshi
Sakshi News home page

అశ్విన్‌రావుకు నివాళి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) చైర్మన్‌ చిక్కాల రామారావు తనయుడు అశ్విన్‌రావు ఇటీవల మరణించగా.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్‌హాల్లో అశ్విన్‌రావు చిత్రపటం వద్ద నివాళి అర్పించిన మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు చిక్కాల రామారావును ఓదార్చారు. అంతకు ముందు ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ రామారావును కలిసి ఓదార్చారు. మాజీ మంత్రుల వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, నాయకులు చీటి నర్సింగరావు, సిద్ధం వే ణు, లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌, బొల్లి రామ్మోహన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి: బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంకు ఏజీఎం నర్సింహరెడ్డి కోరారు. మర్రిగడ్డకు చెందిన దారం రాజు మృతిచెందగా భార్య మౌనినకు పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన పథకం కింద మంజూరైన రూ.2లక్షల బీమా చెక్కును చందుర్తి కేడీసీసీ బ్రాంచ్‌లో గురువారం అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement