● కాంగ్రెస్ నేత నిర్వాకం !
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రం శివారులోని అపెరల్‌పార్కు గోదాంలో నిల్వచేసిన 200 బస్తాలు రెండు రోజుల క్రితం అపహరణకు గురికాగా బుధవారం అధికారులు రికవరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి లారీలో ధాన్యం బస్తాలు దొంగిలించారని సెక్యూరిటీ గార్డు తెలపడంతో ఎస్‌డబ్ల్యూసీ విజయ్ పోలీసులకు ఈనెల 16న ఫిర్యాదు చేశారు. ఈమేరకు బుధవారం రాత్రి పోలీసులు ధాన్యం లోడ్‌తో ఉన్న లారీని రికవరీ చేశారు. ఈ లారీని సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దొంగిలించింది కోనరావుపేట మండలంలోని అధికార పార్టీకి చెందిన ఓ గ్రామాధ్యక్షుడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణ చేపడుతున్నారు.


