ధాన్యం కొనుగోళ్ల రికార్డులు సరిచూసుకోండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్ల రికార్డులు సరిచూసుకోండి

Jun 18 2026 12:05 AM | Updated on Jun 18 2026 12:05 AM

సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల రికార్డులు సరిచూసుకోవాలని, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ అధికారులు తనిఖీలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం పౌరసరఫరాలశాఖ అధికారులతో సమావేశమయ్యారు. నగేశ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది రబీలో జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3.65 లక్షల టన్నుల ధాన్యాన్ని 46,378 మంది రైతుల వద్ద కొనుగోలు చేశామన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు, గోదాములకు ట్రక్‌షీట్‌ ప్రకారం పంపించారా? లేదా? అనే వివరాలు సరిచూసుకోవాలన్నారు. తప్పులు జరిగితే సంబంధిత కేంద్రాల ఇన్‌చార్జీలు, ఏపీఎంలు, సీఈవో, సీసీలు బాధ్యులని హెచ్చరించారు. వేములవాడ ఆర్టీవో కుమారి, డీసీఎస్‌వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ నర్సింహ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement