ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యార్థులు రావ డం లేదన్న నెపంతో మూతపడిన పాఠశాలలు తిరి గి తెరుచుకున్నాయి. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట ప్రాథమిక పాఠశాల మూడేళ్ల క్రితం మూతబడింది. ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని ‘సాక్షి’లో ఇటీవల ప్రచురించిన కథనానికి వి ద్యాశాఖ అధికారులు స్పందించారు. డిప్యూటేషన్‌పై వేరే పాఠశాలలకు కేటాయించిన టీచర్లకు తిరిగి రహీంఖాన్‌పేటలో పోస్టింగ్ ఇచ్చారు. బడిబాటలో భాగంగా ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకున్నారు. మూతపడిన పాఠశాల తిరిగి ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, స ర్పంచ్ కమటం లావణ్య, ఉపసర్పంచ్ గడ్డమీది పద్మ,హెచ్‌ఎం సురేందర్ పాల్గొన్నారు.
పదేళ్ల తర్వాత ఓపెన్
గంభీరావుపేట(సిరిసిల్ల): పదేళ్ల క్రితం విద్యార్థులు లేక మండలంలోని పొన్నాలపల్లి పాఠశాల మూతబడింది. గ్రామస్తులు ఒక్కటై.. 15 మంది విద్యార్థులను చేర్పించడంతో పాఠశాలను బుధవారం పునర్ ప్రారంభించుకున్నారు. తాత్కాలిక సర్దుబాటు ద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ఉమేరా సుల్తానా నియమితులయ్యారు. ఎంఈవో గంగారాం, సర్పంచ్ మహేశ్ పాల్గొన్నారు.


