హైరిస్క్‌ ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

హైరిస్క్‌ ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

సిరిసిల్ల/సిరిసిల్లటౌన్‌: వర్షాకాలంలో డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని, హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి జి.అంజెల అల్ఫ్రడ్‌ కోరారు. మంగళవారం పట్టణంలోని సుందరయ్యనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, చీర్లవంచ పీహెచ్‌సీ, రాజీవ్‌నగర్‌ బస్తీ దవాఖానాను సందర్శించి మాట్లాడారు. ఈనెల 16 నుంచి జూలై 31 వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది ‘స్టాప్‌ డయేరియా’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఓఆర్‌ఎస్‌, జింక్‌ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీస్‌లో పీహెచ్‌సీ వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. స్టాప్‌ డయేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరా రు. జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్‌ పవిత్ర, డాక్టర్‌ ఎల్‌.నాగేందేర్‌బాబు, డీఐవో డాక్టర్‌ సంపత్‌కుమార్‌, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రామకృష్ణ, పోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement