రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గాన్ని ప్రోత్సహించాలి

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

సిరిసిల్లటౌన్‌: కక్షిదారుల్లో రాజీమార్గాన్ని పెంపొందించి లోక్‌ అదాలత్‌లో కే సులు పరిష్కరించుకునేలా చూడాల ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ అన్నా రు. మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో సిరి సిల్ల, వేములవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవా దులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారన్నారు. బార్‌ అసోసియేషన్‌ సభ్యులు లోక్‌ అదాలత్‌లో మరిన్ని కేసుల పరి ష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. మొద టి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌, సీని యర్‌ సివిల్‌ జడ్జి పి.లక్ష్మణాచారి, జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన, సిరిసిల్ల, వేములవాడ బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు, పిట్టల మనోహర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement