మెరుగైన వైద్యం అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందిస్తాం

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

జిల్లా రెవెన్యూ అధికారిగా జయశ్రీ బాధితులకు భరోసా కల్పించాలి బడి బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి ● డీటీవో దేవునూరి శ్రీనివాస్‌ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించండి

బోయినపల్లి(చొప్పదండి): క్యాన్సర్‌తో బాధపడుతున్న మండలంలోని బూర్గుపల్లికి చెందిన తాళ్లపల్లి లతకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్యం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్‌యాదవ్‌, ఉపసర్పంచ్‌ కల్లెపెల్లి చంద్రయ్య, వీసీ వినోద్‌రెడ్డి, నాయకులు లక్ష్మీరాజం, నగేశ్‌, ప్రవీణ్‌, వంశీ ఉన్నారు.

సిరిసిల్ల: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)గా గొట్టె జయశ్రీ విధుల్లో చేరారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(ఎస్‌డీసీ)గా పనిచేసిన ఆమె ఇటీవల డీఆర్‌వోగా బదిలీ అయ్యారు. జిల్లాలో డీఆర్‌వో పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉండగా.. అదనపు కలెక్టర్లు, జిల్లా కలెక్టరే ఇన్‌చార్జీలుగా ఉన్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో జయశ్రీ డీఆర్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. జయశ్రీ తంగళ్లపల్లికి చెందిన నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే గొట్టె భూపతి కొడుకు, ఇల్లంతకుంట మాజీ జెడ్పీటీసీ గొట్టె సుమన్‌బాబు సతీమణి.

సిరిసిల్ల: బాధితులు ఎవరైనా సరే పోలీసులను ఆశ్రయిస్తే భరోసా కల్పించాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. ఎస్పీ ఆఫీస్‌లో సోమవారం గ్రీవెన్స్‌ డేకు 24 మంది ఫిర్యాదులు అందించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి బాధితులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగితే పోలీస్‌ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లాలోని ఠాణా అధికారులకు ఎస్పీ సూచించారు.

సిరిసిల్లటౌన్‌: ప్రైవేటు బడి బస్సులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలని జిల్లా రవాణాధికారి దేవునూరి శ్రీనివాస్‌ సూచించారు. జిల్లా కేంద్రంలో సోమవారం బడి బస్సులను తనిఖీ చేసి మాట్లాడారు. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులను తింపితే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఎంవీఐ వంశీధర్‌, ఏఎంవీఐ పృథ్వీరాజ్‌వర్మ, కానిస్టేబుల్‌ రమ్య, ప్రశాంత్‌, హోమ్‌గార్డు ఎల్లయ్య పాల్గొన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో మౌలిక వసతులు ఉన్నాయని, తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి కోరారు. మండలంలోని గాలిపెల్లి, ఇల్లంతకుంట పాఠశాలలను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ జిల్లాలో 65 వరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పురుషులు కూడా అర్హులేనని తెలిపారు. వంట సామాగ్రిని పరిశీలించి, ఎర్రపప్పు వాడొద్దని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిపై కాకుండా గ్యాస్‌ సిలిండర్‌పై వండాలన్నారు. హెచ్‌ఎంలు పావని, ఆగయ్య, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్‌, అంగన్‌వాడీ టీచర్‌ ఒగ్గు విజయ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement