వేములవాడ: భీమేశ్వరస్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయంలు సోమవారం దర్శించుకున్నారు. అతిథులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం కావడంతో 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈవో రమాదేవి అతిథులకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఆర్డీవో కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు.


