లోక్‌ అదాలత్‌లో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో సత్వర న్యాయం

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ

సిరిసిల్లటౌన్‌: లోక్‌ అదాలత్‌లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, పోలీసు అధికారులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 20న జరిగే లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసుల పరిష్కారమయ్యేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌, జిల్లా అదనపు ఎస్పీ డి.చంద్రయ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి, పి.లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్‌, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జూనియర్‌ సివిల్‌ జడ్జి మేఘన పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement