చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9.10 గంటలకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. 24 గంటలు సేవలందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది కనిపించడం లేదు. కొద్ది రోజులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపించారు. పీహెచ్‌సీకి ‘సాక్షి’ వెళ్లి వచ్చిందన్న విషయం తెలుసుకున్న సిబ్బంది ఉదయం 10.20 గంటలకు చేరుకున్నారు. వైద్యాధికారి వేణుమాధవ్‌ను వివరణ కోరగా ఆదివారం అత్యవసర కేసులు ఉన్నాయని సిబ్బంది ఫోన్ చేస్తేనే ఆస్పత్రికి వస్తామని తెలిపారు. లేకుంటే ఆదివారం రావాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 9.10 గంటలకు సిబ్బంది ఎవరూ లేరనగా.. షిప్టింగ్ సమయంలో వెళ్లారని, అందుకే కనిపించక పోవచ్చన్నారు.


