పాఠశాల పిలుస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

పాఠశాల పిలుస్తోంది..

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

● నేటి నుంచి స్కూళ్లు పునర్‌ ప్రారంభం

సిరిసిల్లటౌన్‌: రెండు నెలల వేసవి సెలవుల అనంతరం సోమవారం బడిగంట మోగింది. ఇన్నాళ్లు ఆటపాటలతో గడిపిన చిన్నారులు ఇక పుస్తకాలు సర్దుకున్నారు. యూనిఫామ్స్‌, షూస్‌, వాటర్‌బాటిల్స్‌ సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్‌ అందించనుండగా..ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే కొ నుగోలు చేశారు. అమ్మ ఆదర్శ కమిటీలతో ప్రభుత్వ బడుల్లో వసతులు దరిచేరాయి.

పాఠాలకు సిద్ధం

ప్రభుత్వ బడులకు ఇప్పటికే పుస్తకాలు వచ్చాయి. జిల్లాలో గతేడాది ప్రభుత్వ బడుల్లో 39,043 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈఏడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2,59,720 పుస్తకాలు ప్రభుత్వం పంపించింది. జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు 314, యూపీఎస్‌ 38, హైస్కూల్స్‌ 111, కేజీబీవీ 13, మోడల్‌ స్కూల్స్‌ 7 మొత్తం 483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక 13 మండలాలకు ఎంఈవోలు 13 మంది ఇన్‌చార్జీలు(ఎఫ్‌ఏసీ)గా పనిచేస్తున్నారు. 483 హెచ్‌ఎంలు, 13 కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లు, ఏడుగురు మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ పనిచేసున్నారు. అన్ని పాఠశాలల్లో 39,043 మంది విద్యార్థులకు 2,282 టీచింగ్‌, 149 నాన్‌టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. 131 హైస్కూళ్లలో డిజిటల్‌ పాఠాల బోధనకు ఏర్పాట్లు చేశారు. ఆరు నుంచి తొమ్మిది తరగతుల వారికి ఖాన్‌ అకాడమీ ద్యారా ప్రభుత్వం ఫౌండేషన్‌ డిజిటల్‌ కోర్సు అందిస్తున్నారు. కేజీబీ వీల్లో ఫిజిక్స్‌వాలా యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

జిల్లా సమాచారం

ప్రభుత్వ బడులు 483

గతేడాది విద్యార్థులు 39,043

గురుకులాలు 20

కేంద్రీయ విద్యాలయం 01

మదర్సా 01

కేజీబీవీలు 13

మోడల్‌స్కూల్స్‌ 07

ప్రైవేటు స్కూల్స్‌ 130

బడిబాట ప్రవేశాలు 2,870

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement