రాజన్న ఆలయానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయానికి రూ.లక్ష విరాళం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం భోగంపాడుకు చెందిన కల్లం రాధిక– రాజారెడ్డి దంపతులు రూ.లక్ష విరాళాన్ని ఆదివారం ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాసశర్మకు అందజేశారు. ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందించారు.

సాహితీవేత్తల సేవలు అద్వితీయం

సిరిసిల్లటౌన్‌: ప్రజల్లో సామాజిక చైతన్యం రగిలించడంలో సాహితీవేత్తల సేవలు అద్వితీయమని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి కొని యాడారు. గాంధీనగర్‌ హనుమాన్‌ ఆలయంలో ఆదివారం ‘ఆదర్శ మార్గదర్శకులు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక రచయిత జనపాల శంకరయ్యను అభినందించారు. కౌన్సిలర్‌ గుండ్లపెల్లి నీరజ, జూకంటి జగన్నాథం, సబ్బని లక్ష్మీనారాయణ, కరుణాల భద్రాచలం, పోరండ్ల మురళీధర్‌, నీరోజు రమేశ్‌, చేపూరు బుచ్చయ్య, దొంత దేవదాసు, కోడం నారాయణ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

వేములవాడ: కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా మున్సిపల్‌ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరించడం లేదని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు గుర్రం అశోక్‌ అన్నారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అధికా రంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికులకు రూ.26వేలు ఇస్తామని, పర్మినెంట్‌ చేస్తామని చెప్పి పట్టించుకోవడంలేదన్నారు. ఈనెల 4 నుంచి 15 వరకు ముఖ్యమంత్రికి రాస్తున్న లేఖలపై కార్మికులందరూ సంతకాలు చేయాలని కోరారు. యూనియన్‌ అధ్యక్షు డు సరిపెల్లి నరేశ్‌, ప్రధాన కార్యదర్శి దొబ్బల లచ్చయ్య, కోశాధికారి సావనపల్లి శ్రీనివాస్‌, నాయకులు సత్తయ్య, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement