● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ప్రజా ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ ఫెయిలైందంటూ కేటీఆర్ మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ కమిటీల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిలైనందునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఫస్ట్ హాఫ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇళ్లు అందజేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు.
వైఎస్ హయాంలోనే ఎల్లంపల్లి నిర్మాణం
వేములవాడరూరల్: ఎల్లంపల్లి ప్రాజెక్టును వైఎస్సార్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీగా మొదటి ఆరు నెలల్లోనే విఫలమైందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏ పార్టీ నుంచి పోటీ ఉండబోదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ హయాంలోనే వరద కాలువ వచ్చిందని, అప్పుడు కేటీఆర్ రాజకీయాల్లోకి కూడా రాలేదన్నారు. 14 ఏళ్ల క్రితమే ఎస్సారెస్పీ నుంచి నీరు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీని వాస్, ఆత్మ కమిటీ సభ్యులు శ్యామల, గోవర్ధన్, ఎల్లాగౌడ్, రవి, రాంరెడ్డి, ఫిరోజ్‌పాషా ఉన్నారు.


