ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేసి ఉంది. స్థానికులను ఆరా తీయగా ఆదివారం తీయరని తెలిపారు. ఇక్కడ ఒక డాక్టర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. పెద్దలింగాపూర్‌తోపాటు రామాజీపేట, చిక్కుడువానిపల్లి, దాచారం, సిరికొండ, తెనుగువారిపల్లి గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కాంట్రాక్టు ఏఎన్‌ఎం ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆదివారం హాఫ్ డే వరకే తెరిచి ఉంటుందని, డాక్టర్ రారని తెలిసింది. జవారిపేట సబ్ హెల్త్‌సెంటర్‌లో కాంట్రాక్టు ఏఎన్‌ఎం సుమతి ఒక్కరే విధుల్లో ఉన్నారు.


