ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

● గంభీరావుపేటలో 91 మిల్లీమీటర్లు ● కందికట్కూర్‌లో 0.5 మి.మీ. వర్షం

● గంభీరావుపేటలో 91 మిల్లీమీటర్లు ● కందికట్కూర్‌లో 0.5 మి.మీ. వర్షం

సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ముసురువర్షం కురి సింది. గంభీరావుపేట మండలంలో అత్యధికంగా 91 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చల్లని గాలులతో కూడిన వర్షం జల్లులు కురిశాయి. రుద్రంగిలో 45.3 మిల్లీమీటర్లు, నామాపూర్‌లో 41.5, వీర్నపల్లిలో 33.5, గజసింగవరంలో 25.0, నిజామాబాద్‌లో 23.0, ఎల్లారెడ్డిపేటలో 22.3, మానాలలో 19.0, వట్టెంలలో 18.3, బోయినపల్లిలో 15.5, మర్తనపేటలో 13.5, మర్రిగడ్డలో 13.0, నాంపల్లిలో 12.8, ఇల్లంతకుంటలో 11.5, ఆవునూర్‌లో 8.8, కలెక్టరేట్‌ వద్ద 7.5, మల్లారంలో 6.0, పెద్దలింగాపూర్‌లో 3.8, నేరెళ్లలో 2.5, పెద్దూరులో 1.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

నేల కూలిన వృక్షాలు

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ఈదురుగాలులతో మహావృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఓ ఇంటిపై విద్యుత్‌ స్తంభం పడడంతో పాక్షికంగా దెబ్బతింది. మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రాచర్లబొప్పాపూర్‌లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మండలకేంద్రంతోపాటు నారాయణపూర్‌, బండలింగంపల్లి, రాచర్లబొప్పాపూర్‌, గొల్లపల్లి, పదిర, హరిదాస్‌నగర్‌లలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. బొప్పా పూర్‌లో జంగం రాజు ఇల్లు కొంత భాగం కూలింది. గాలివాన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ గీతాంజలి కోరారు. గంభీరావుపేట మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రోడ్ల వెంబడి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. మండలకేంద్రంతోపాటు నర్మాల, లింగన్నపేట, ముస్తఫానగర్‌గ్రామాల్లో వర్షం కురిసింది. ఎన్పీడీసీఎల్‌ సీఈ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ నిర్వహణ పనులు చేశారు.

బొప్పాపూర్‌లో ధ్వంసమైన ఇల్లు

బొప్పాపూర్‌లో విరిగిపడ్డ వృక్షం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement