● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: వరదకాలువ కేసీఆర్ ఆలోచనగా జీవన్‌రెడ్డి చెప్పడంపై వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వే ములవాడలో కేటీఆర్, జీవన్‌రెడ్డి మాట్లాడిన తీరుపై విప్ ఆది శ్రీనివాస్ శనివారం కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే వరదకాలువ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలను ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘ఎస్‌ఐఆర్’ పేరుతో నిర్వహించిన సభను బీఆర్‌ఎస్ నాయకులు అబద్ధాల ప్రచార వేదికగా మార్చారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను రాసిచ్చిన బాండ్ పేపర్‌పై ఉన్న హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకే కాళేశ్వరం మరమ్మతుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం జరుగుతున్నాయని వివరించారు. బీఆర్‌ఎస్ సభలో చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


