నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పర్యటన

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

● రాజన్న ఆలయ ఈవో రమాదేవి ‘పల్లగుట్టను కొల్లగొట్టొద్దు’

సిరిసిల్లటౌన్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ శనివారం సిరిసిల్లలో పర్యటించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుసుమ రామయ్య స్కూల్‌లో నిర్వహించే ‘మన బడి – మన బాధ్యత’(స్వచ్ఛ పాఠశాల) కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

వేములవాడ: రానున్న వర్షాకాలం నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేయాలని రాజన్న ఆలయ ఈవో రమాదేవి సూచించారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంతోపాటు పరిసరాలు, అతిథిగృహాలను పరిశుభ్రంగా ఉంచారని శానిటేషన్‌ సిబ్బందిని అభినందించారు. శుక్రవారం అధికారులు, శానిటేషన్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవో మాట్లాడుతూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు, క్రిమికీటకాల నివారణకు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలన్నారు. శానిటేషన్‌ సిబ్బందికి ప్రతీ నెల నాలుగు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. డీఈవో భాస్కర్‌శర్మ, ఏఈవో అశోక్‌, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, పూజిత పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్‌లోని పల్లగుట్టను పరిరక్షించాలని కోరుతూ బీజేపీ మండలాధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్‌ శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముస్తాబాద్‌ మేజర్‌ పంచాయతీ కార్యాలయం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంజాగౌడ్‌ మాట్లాడుతూ ముస్తాబాద్‌ మండలానికి ప్రాణాధారమైన, వన్యప్రాణులకు నిలయమైన పల్లగుట్ట ఆక్రమణలకు గురవుతుందన్నారు. 116 ఎకరాల్లో విస్తరించిన పల్లగుట్టతో నామాపూర్‌, గూడూరు, ముస్తాబాద్‌, గూడెంలకు ఉపయోగకరంగా ఉందన్నారు. గతంలో లీజుకు ఇచ్చే ప్రయత్నాలను మండల ప్రజలు అడ్డుకున్నారని, ఇప్పుడు గుట్ట ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తహసీల్దార్‌ ఫారూఖ్‌ హామీ మేరకు అంజాగౌడ్‌ దీక్షలను విరమించారు. దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సర్పంచ్‌ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి, ఆవునూర్‌ సర్పంచ్‌ రవీందర్‌, మాజీ సర్పంచులు వొరగంటి తిరుపతి, చాకలి రమేశ్‌, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు కొమ్మెట రాజు, నాయకులు సంజీవ్‌, శ్రీనివాస్‌రావు, నరేశ్‌, గోపి, చంద్రం, వెంకన్న, వేణు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement