నాన్న.. నీవే నా ధైర్యం అనుకున్న
నాన్న.. నేను స్కూల్ నుంచి రాగానే ప్రతి రోజూ నా కోసం ఎదురుచూసే వాడివి. ఇప్పుడు నువ్వు కనిపించడం లేదు. నువ్వు ఉన్నావనే ధైర్యంతో అందరితో నవ్వుతూ తిరిగేవాడిని. ఇప్పుడు నా వెనుక నువ్వు లేవని తెలిసి కన్నీళ్లు ఆగడం లేదు. మా నాన్న లాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలను అనాథలుగా చేయకండి. మమ్మల్ని వదిలి వెళ్లిపోకండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు.
– జంగునాయక్,
శాంతినగర్(గుగులోత్ గోపాల్ కొడుకు)
వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన గుగులోతు గోపాల్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ భరించలేక గత మార్చి 21న తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇద్దరు బిడ్డలు, కొడుకు, భార్య నిర్మల ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఇల్లాలికి పిల్లలను ఎట్ల పెంచుకోవాలో తెలియక భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది.
నేలవాలిన వరి.. రాలిన మామిడి


