ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని మూత్రశాలల తాళం తీశారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఇల్లంతకుంట గ్రామపంచాయతీ సిబ్బంది మూత్రశాలల తాళాలు బుధవారం తీశారు. బాటసారులు ప్రయాణికులు గ్రామపంచాయతీ సిబ్బందికి, ‘సాక్షి’ దినపత్రికకు ధన్యవాదాలు తెలియజేశారు.
వరదలతో ఎగువ మానేరు ఎఫ్రాన్‌కు నష్టం
ముస్తాబాద్(సిరిసిల్ల): భారీ వరదలతో ఎగువ మానేరు ప్రాజెక్టు ఎఫ్రాన్ దెబ్బతిందని ప్రాజెక్టు ఈఈ ప్రశాంత్‌కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో ‘ఎగువ మానేరుకు ముప్పు’ శీర్షికన కథనానికి ఈఈ స్పందించారు. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిశాయని, భారీ వరదలతో ప్రాజెక్టుకు ఫ్లాష్‌ఫ్లడ్ వచ్చిందన్నారు. డౌన్‌స్ట్రీమ్‌తో ఎఫ్రాన్ దెబ్బతిందన్నారు. నిపుణుల కమిటీ సర్వే కోసం తాము ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిపుణుల కమిటీ సిఫారసుతో తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టామన్నారు. చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సూచనలు అందిన తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


