ముస్తాబాద్(సిరిసిల్ల): కేసీఆర్ కప్ క్రికెట్ మండల స్థాయి విజేతగా పోతుగల్ జట్టు నిలిచింది. ముస్తాబాద్ పులిచేరుకుంట మైదానంలో బుధవారం ముస్తాబాద్, పోతుగల్ మధ్య ఫైనల్‌మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ముస్తాబాద్ జట్టుపై పోతుగల్ జట్టు విజయం సా ధించింది. విజేత పోతుగల్ జట్టుకు రూ.50వేలు నగదు, రన్నరప్ జట్టుకు రూ.20వేలు నగ దును నాఫ్స్‌కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేతుల మీదుగా అందజేశారు. సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, మండల అధ్యక్షుడు బోంపెల్లి సురేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సర్వర్, కొండ శ్రీను, సంతోష్‌రావు, భరత్, నందు, చెవుల మల్లేశ్, కోడె శ్రీను పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత
గంభీరావుపేట(సిరిసిల్ల): ‘మన ఇసుక వాహనాలు’ బుధవారం గంభీరావుపేటలో ఆగిపోయాయి. అనుమతుల(మన ఇసుక వాహనాలు)తో వెళ్తున్నప్పటికీ ఆ ఇసుక ట్రాక్టర్‌లను గంభీరావుపేట ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు. గతంలో మల్లుపల్లి ఇసుక రీచ్‌కు వెళ్లినప్పుడు తమ ట్రాక్టర్‌లను ఆ గ్రామ ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారని, ఇప్పుడు మల్లుపల్లి ఇసుక రీచ్ నుంచి గంభీ రావుపేట మీదుగా ముచ్చర్ల వెళ్తున్న మల్లుపల్లికి ట్రాక్టర్‌లను గంభీరావుపేట ట్రాక్టర్ య జమానులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇరు గ్రామాల ట్రాక్టర్ యజమానులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది.
‘పాలిస్టర్’ కూలి పెంచాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాముల కూలీలు పెంచాలని పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. బుధవారం సిరిసిల్లలోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అగ్రిమెంట్ పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా కూలి పెంచడం లేదన్నారు. పాలిస్టర్ కూలి పెంచాలని ఈనెల 20న వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒక రోజు సమ్మెను విజయవంతం చే యాలని కోరారు. నాయకులు కోడం రమణ, సిరిమల్లె సత్యం, ఒగ్గు గణేశ్, ఉడుత రవి, దూస అశోక్, ఆడెపు మోహన్, బెజిగం సురే శ్, స్వర్గం శేఖర్, బింగి సంపత్ పాల్గొన్నారు.
మూడపల్లి బిడ్డకు దళితరత్న అవార్డు
చందుర్తి(వేములవాడ): మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు, మండలంలోని మూడపల్లికి చెందిన నీరటి శ్రీనివాస్ దళితరత్న అవార్డు అందుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉత్సవ కమిటీ కోకన్వీనర్ డాక్టర్ అల్లిబిల్లి మహేందర్ చేతుల మీదగా అందుకున్నారు. గత పదహారేళ్లుగా శ్రీనివాస్ చేస్తున్న దళిత, బహుజన, తెలంగాణ ప్రజా ఉద్యమాలు, సమాజ సేవను గుర్తించి అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అగ్ని ప్రమాదాలు లేని సమాజం నిర్మిద్దాం
సిరిసిల్ల: అగ్ని ప్రమాదాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సిరిసిల్ల అగ్నిమాపక అధికారి నరేందర్ కోరారు. సిరిసిల్ల పాతబస్టాండులోని నేతన్నచౌక్‌లో బుధవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక విన్యాసాలు చేశారు. నరేందర్ మాట్లాడుతూ అతిచిన్న నిప్పు రవ్వ అపారమైన ఆస్తి నష్టానికి, ప్రాణనష్టానికి కారణమవుతుందన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సంపద బూడిదవుతుందన్నారు. నిప్పు విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. లీడింగ్ ఫైర్ ఫైటర్ టి.నర్సింహాచారి, టెక్నికల్ ఫైర్ ఫైటర్స్ గణేశ్, అనిల్ పాల్గొన్నారు.


