వేములవాడను సుందరంగా తీర్చిదిద్దుతాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తమ కర్తవ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మల్లారంరోడ్డు చౌరస్తా నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా జగిత్యాల బస్టాండ్, సాయిరక్ష దాబా వరకు రూ.2.60కోట్లతో డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. 146 కొత్త పోల్స్ వేసుకుంటూ 3.6 కిలోమీటర్ల మేర నూతన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూడవ బ్రిడ్జి నిర్మాణం, ప్రతి వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. రెండేళ్లలో వేములవాడ రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ట్రస్ట్ సేవలు అభినందనీయం
మై వేములవాడ ట్రస్టు సేవలు అభినందనీయమని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆలయ ఈవో రమాదేవి, ఆర్యవైశ్య నాయకులు, ట్రస్ట్ నిర్వాహకులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంను కలిసిన ప్రభుత్వ విప్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్‌లో కలుసుకుని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. కాచారంలో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రుద్రంగిలో 220 కేవీ సబ్‌స్టేషన్‌కు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని వివరించారు.


