రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీఒక్కరి బాధ్యత
సిరిసిల్లక్రైం: జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. యువత, క్రీడాకారులు, ఉపాధ్యాయులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అరైవ్ అలైవ్‌పై ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని, ఆ సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు.
జాతరలు సంప్రదాయాలకు ప్రతీక
వేములవాడరూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. వేములవాడరూరల్ మండలం నాగయ్యపల్లిలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించే శ్రీదుబ్బరాజన్న స్వామి జాతర పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. జాతరలో భక్తులు శాంతియుతంగా పాల్గొని పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.


