ఊరెళ్తున్నారా.. జర భద్రం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల క్రైం: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటే జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. సెలవుల నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీస్‌గస్తీ పెంచినట్లు తెలిపారు. ఊరికి వెళ్లే వారు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లే వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రయాణ వివరాలను సోషల్‌మీడియాలో పంచుకోవద్దన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
వేములవాడఅర్బన్: వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలోని దుబ్బరాజన్న ఆలయంలో ఈనెల 17, 18న నిర్వహించే జాతర పోస్టర్‌ను రాజన్న ఆలయ ఈవో రమాదేవి శనివారం ఆవిష్కరించారు. ఈవో రమాదేవి మాట్లాడుతూ గ్రామదేవత ఆశీస్సులతో జాతరను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సిరిసిల్లటౌన్: జిల్లా గ్రంథాలయం శనివారం మూసి ఉండడంపై వివాదం నెలకొంది. లైబ్రరీ అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు అనువైన సమయంలో లైబ్రరీ మూసేయడం సరికాదంటూ పలువురు నిరుద్యోగులు గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. లైబ్రేరియన్ శంకరయ్య మాట్లాడుతూ రెండో శనివారం సెలవు దినం అయినప్పటికీ లైబ్రరీ తెరిచామని, తమ సిబ్బంది రావడం ఆలస్యమెందని వివరించారు. గతంలో నిరుద్యోగుల కోరిన నేపథ్యంలో సెలవు దినాల్లోనూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు గ్రంథాలయం తెరిచి ఉంచుతున్నామని తెలిపారు.
ఊరెళ్తున్నారా.. జర భద్రం
ఊరెళ్తున్నారా.. జర భద్రం


