పోషకాహార లోపంతోనే పిల్లల మరణాలు
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: ఐదేళ్లలోపు చిన్నారుల మరణానికి పోషకా హారలోపం, తక్కువ బరువులో ఏడు నెలల కాన్పులు కారణమని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్యాధికారి ఆఫీస్‌లో గురువారం జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో మా ట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లల మరణానికి గల కారణాలపై ఆరా తీశారు. మూడు నెలల్లో జిల్లాలో ఏడుగురు చిన్నారులు మరణించారని, ప్రధాణంగా త క్కువ బరువుతో పుట్టిన పిల్లలు, ఏడు నెలల కాన్పులు, పోషకాహార లోపమే కారణమన్నారు. సకాలంలో టీకాలు వేయకపోవడంతో వ్యాధి నిరోధకశక్తి తగ్గి అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారని పే ర్కొన్నారు. ఆశకార్యకర్తలు ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయాలని సూచించారు. పిల్లల మరణాలు తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల వైద్య నిపుణులు సా యికుమార్, శృతి, ప్రోగ్రాం అధికారులు నాగేంద్రబాబు, సంపత్‌కుమార్, రామకృష్ణ, అనిత, డిప్యూ టీ డెమో రాజ్‌కుమార్, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


